BRS: నల్ల చొక్కాలు ధరించి నిరసన చేపట్టిన బీఆర్ఎస్...! 5 d ago
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలు ధరించి, చేతులకు బేడీలు వేసుకొని వినూత్న నిరసనలు చేపట్టారు. లగచర్ల రైతులకు బేడీలు వేస్తారా అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం లాటీ రాజ్యం లూటీ రాజ్యం.. రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేపట్టారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు నిరసన తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు.